ఇండియా పోస్టులో చారిత్రాత్మక మార్పులకు శ్రీకారం : కేంద్రమంత్రి పెమ్మసాని 22 h ago
AP: ఇండియా పోస్టులో చారిత్రాత్మక మార్పులకు శ్రీకారం చుడుతున్నామన్నారు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. కేవలం 24 గంటల్లోనే ఫాస్ట్ డెలివరీ సేవలు ప్రారంభం అవుతాయని చెప్పారు. 30 కోట్ల మందికి వేగవంతమైన పార్సిల్ సేవలు అందించనున్నారు. ఐటీ 2.O కోసం రూ.5,000 కోట్ల పెట్టుబడి, ఎస్ఎంఎస్ ట్రాకింగ్, ఓటీపీ, జియో ట్యాగింగ్ వంటి సేవలను అమలు చేయనున్నారు. 97 - 98% డెలివరీలు 24 నుంచి 48 గంటల్లో పూర్తి చేసే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. అదే విధంగా బుక్ నౌ-పే లేటర్ సేవలకు శ్రీకారం చుట్టనున్నారు.